ప్రలోభాలకు లొంగవద్దు: బాబు
హైదరాబాద్: అధికార కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు లొంగవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శాసనసభ్యులకు సూచించారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. తమ పార్టీ నాయకులను వేధిస్తున్న ఐపియస్, ఐఎఎస్ అధికారులు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలట్ విధానంలోనే నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదోరోజు శనివారం ఆయన కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి బీసీ రిజర్వేషన్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
నిత్యావసర ధరల పెరుగుదల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. ప్రజల గోడు పట్టని పాలకుల్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రేటర్‌లో దేశం పార్టీకి మేయర్ పదవి కట్టబెడితే నీతివంతమైన. సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications