ప్రజలు మాతోనే: చిరంజీవి
హైదరాబాద్: ప్రజలు ప్రజారాజ్యంతోనే ఉంటారని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సికింద్రాబాద్ కు చెందిన పలువురు శనివారం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఇంత మంది తమ పార్టీలోకి రావడం శుభారంభమని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పార్టీ కార్యకర్తలు చిరంజీవికి ఫిర్యాదు చేశారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఆయన చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై ప్రజారాజ్యం పార్టీ ప్రజాపోరాటానికి సమాయత్తమవుతోంది. రాజకీయ పరిష్కారంతోనే బాబ్లీ నిర్మాణానికి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ నేత దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బాబ్లీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications