ప్రతిపక్షాన్ని ఎదుర్కోండి : డిఎస్
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ,శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉభయ సభలకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు సూచించారు. కాంగ్రెస్‌సభ్యులు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా కేంద్రంలో శాసనసభ, మండలికి కొత్తగా ఎన్నికయిన కాంగ్రెస్ సభ్యుల శిక్షణాశిబిరంలో ఆయన మాట్లాడారు.
గత శాసనసభతో పోలిస్తే ప్రస్తుత సభలో ప్రతిపక్షం బలంగా ఉందన్న అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాల్లో సభ్యులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొవాలని కోరారు.












Click it and Unblock the Notifications