పాలమూరులో ప్రత్యక్షమైన కెసీఅర్
మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడు చంద్రశేఖరరావు శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయిన అనంతరం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.మొదట కొడంగల్ చేరుకుని ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మహబూబ్‌నగర్‌కు చేరుకొంటారు. ఆయన రాక సందర్భంగా ఘనస్వాగతం చెప్పేందుకు పార్టీశ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications