రేపు విశాఖకు మన్మోహన్
విశాఖపట్నం: ప్రధాని మన్మోహన్ సింగ్ ఈనెల 26వ తేదీన ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. తూర్పు నౌకాకేంద్రమైన విశాఖపట్నంలో ఆయన రెండు గంటల పాటు గడుపనున్నారు. స్వదేశీయంగా తయారు చేసిన తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను జల ప్రవేశం చేసేందుకుగాను ఆయన విశాఖ వస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నగరంలో గట్టి భద్రతను ఇప్పటి నుంచే పోలీసు బలగాలను మొహరించారు. మావోయిస్టుల నుంచి ప్రధానికి ముప్పు పొంచి ఉండటంతో ఆయన పర్యటించే మార్గంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా ఎన్.ఎస్.జి. భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ విశాఖకు రావడం ఇది తొలిసారి. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరే ప్రధాని నేరుగా విశాఖకు చేరుకుంటారు. 12 గంటలకు జలాంతర్గామిని జల ప్రవేశం చేయిస్తారు. తిరిగి ఒంటి గంటకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications