బాబును పట్టించుకోను: రోశయ్య
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. తాను అధికారంలోకి రాలేననే అక్కసుతో చంద్రబాబు ఆ విధమైన విమర్శలు చేస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
బడ్జెట్ కు దశాదిశాలేదని చంద్రబాబుతో పాటు ఆయన మిత్రులు కూడా వ్యాఖ్యానించారని, అటువంటి వ్యాఖ్యలు సాధారణమేనని రోశయ్య అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా మంచి బడ్జెట్ ప్రతిపాదించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications