హుందాగా ఉండండి : వైఎస్
హైదరాబాద్ : శాసనసభ సమావేశాల్లో సభ్యులు హుందాగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కాంగ్రెస్ సభ్యులకు శిక్షణా తరగతులను ప్రారంభించిన ఆయన ప్రసంగిస్తూ గతంలో తాను కూడా తప్పులు చేశానని అయితే అలాంటవి మళ్లీ జరగకుండా జాగ్రత్తపడుదామని అన్నారు. ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా నిబద్దతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications