సంక్షేమంలో ఐటి కీలకం:వైఎస్
హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో ఐటీ పాత్ర కీలకమైనదని , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. మూడవ అంతర్జాతీయ జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆరోగ్య సదస్సును ఆయన ఈరోజు హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆరోగ్యశ్రీ, 108 సర్వీసుల కార్యక్రమాలకు ఐటీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు.












Click it and Unblock the Notifications