స్పీకర్ పైకి మైక్ విసిరిన ముఫ్తీ

ముందు తమను మాట్లాడనివ్వాలని కోరుతూ ముఫ్తి సభా ప్రాంగణంలోకి దూసుకువెళ్లారు. ఆమె స్పీకర్ వైపు వెళ్తుండగా, మహిళా భద్రతా విభాగానికి చెందిన ఒకరు ఇది మామూలే అన్నట్టు నవ్వుతూ వచ్చి ముఫ్తిని ఆపే ప్రయత్నం చేశారు. కాని ముఫ్తి వేగంగా ఇంకా ముందుకు దూసుకుపోగా, స్పీకర్ ఈమెను బయటకు తీసుకుపోండని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అంతలో ముఫ్తి ఆవేశంతో ఊగిపోతూ నన్ను బయటక తీసుకుపొమ్మంటావా అంటూ స్పీకర్ వేదికపైకి లంఘించారు. అక్కడున్న కాగితాలు ఇవతలికి తోసేస్తూ వేదికపై బిగించివున్న మైక్‌ను బలవంతంగా గుంజారు. ఆ మైక్‌ను సభాపతిపైకి విసిరేటట్టు ఆమె కనిపించడంతో భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకువెళ్లారు. ఆమెతో పాటు సభలో నినాదాలు చేసిన ఆమె పార్టీ సభ్యులను కూడా బయటకు తీసుకువెళ్లారు.
మాట్లాడుతూ జరిగిన దానికి తాను క్షమాపణలు కోరవలసిన అవసరం లేదని, సభలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి పల్లెత్తు మాట్లాడలేదని సభ వెలుపలికి వచ్చిన అనంతరం ముఫ్తీ మీడియా ప్రతినిధులతో అన్నారు. పాలకపక్షమే తమను ఇంత వివక్షకు గురిచేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. స్పీకర్ తమపై పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా టేక్ దిస్ లేడీ అవుట్ అంటూ అవమానకరంగా ప్రవర్తించారని ఆమె చెబుతున్నారు.












Click it and Unblock the Notifications