నువ్వు మొనగాడివా: రోశయ్య

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసుపై మంగళవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. శాసనసభ జీరో అవర్ లో నాగం జనార్దన్ రెడ్డి తనపై పెట్టిన కేసును ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాగం జనార్దన్ రెడ్డిపై పెట్టిన కేసుపై చర్చ జరగాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. నాగం జనార్దన్ రెడ్డికి మైక్ ఇవ్వాలని గాలి ముద్దు కృష్ణమ నాయుడు లేచి డిప్యూటీ స్పీకర్ మనోహర్ ను కోరారు. ఈ సమయంలో రోశయ్య జోక్యం చేసుకుని - నువ్వు మొనగాడివా, సిగ్గు శరం లేదు అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరింతగా పరుష పదజాలం కూడా వాడారు.

తనపై నమోదు చేసి ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుపై సమాచారం అందించాలని నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తనపై పెట్టిన కేసును ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఇప్పటికిప్పుడు కేసును ఉపసంహరించడం సాధ్యం కాదని, దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమేయంతోనే తనపై కేసు పెట్టారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+