హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రైవేట్ వైద్య కళాశాలలకు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల యాజమాన్యానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయ్యింది. యాజమాన్య కోటా కింద సీట్ల పెంపు అప్పీల్‌ ను మంగళవారం ధర్మాసనం తిరస్కరించింది. యాజమాన్యం కోటాను పెంచిపించేందుకు ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రయత్నాలు ఫలించలేదు. యాజమాన్యం కోటా పెంపుపై ఇటీవల హైకోర్టు స్టే మంజూరు చేసింది.

యాజమాన్యం కోటా పెంపును తిరస్కరించడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కోటా సీట్ల పెంపును కొనసాగిస్తూ ఆదేశాలివ్వాలని అంటూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి పిటిషన్ ను తిరస్కరించింది. యాజమాన్యం కోటాను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X