సయీద్ ను అరెస్టు చేయలేం: పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల కేసులో జమాద్ - ఉద్ - దావా నేత హఫీజ్ సయీద్ ను అరెస్టు చేయలేమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ముంబై దాడుల్లో సయీద్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. కేవలం ప్రకటనలపై ఆధారపడి అతన్ని అరెస్టు చేయలేమని, భారత్ తగిన ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. సయీద్ పై ఏ విధమైన ఆధారాలు లేవని ఆయన జియో న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
సయీద్ పాత్రపై రుజువులు ఇవ్వాలని తాము ఇండియాను డిమాండ్ చేశాం, చేస్తున్నామని, భారత్ కేవలం ప్రచారానికి ఒడిగట్టకూడదని, తాము చర్య తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామని, అయితే కేవలం మాట మాత్రంగానే తమ పౌరుడిని అరెస్టు చేయలేమని ఆయన అన్నారు. న్యూఢిల్లీ తగిన చర్యలను కోరుకుంటే నిర్దిష్టమైన ఆధారాలు చూపాలని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications