సెక్స్ స్కామ్ లో ఒమర్ లేడు: సిబిఐ
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరు 2006 సెక్స్ కుంభకోణంలో లేదని సిపిఐ స్పష్టం చేసింది. పిడిపి ప్రభుత్వ హయాంలో ఈ కేసులో ఇద్దరు మంత్రులు అరెస్టయ్యారు. తమ దర్యాప్తు సందర్భంగా ఏ సందర్భంలోనూ ఒమర్ పేరు రాలేదని, ఈ కేసులో తాము ప్రశ్నించివారిలో మూడు డజన్ల మంది దాకా ఉంటారని తెలిపింది.
ఒమర్ పేరును అనవసరంగా జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీ అనవసరంగా లాగిందని వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లా పేరు 1-2 స్థానంలో ఉందని శాససనభలో పిడిపి నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ ఆరోపించారు. తాము సెక్స్ కుంభకోణాన్ని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేశామని సిబిఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాము 2006లో జాబితా తయారు చేశామని, ఆ జాబితాకు దర్యాప్తు సమయంలో సందర్భ శుద్ధి లేదని, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications