తెలుగు సినీ విలన్ రాజన్ మృతి

Rajan P Dev
కొచ్చి: ప్రముఖ మలయాళీ నటుడు రాజన్ పి దేవ్ బుధవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. కాలేయం దెబ్బ తినడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోనే ఆయన కన్ను మూశారు. ఆయన పలు తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. ఆది, ఆర్య, బన్నీ, బాలు, గుడుంబా శంకర్ సినిమాల్లో ఆయన విలన్ గా నటించారు.

రాజన్ పి. దేవ్ భౌతిక కాయానికి అంగమలీలోని సెయింట్ జేవియర్ చర్చిలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయి. ఆలపుజా జిల్లాలోని చెర్తాలా గ్రామంలో జన్మించిన రాజన్ 1980లో చిన్న పాత్రలతో సినీ రంగ ప్రవేశం చేశారు. మూడు దశాబ్దాల పాటు 180కి పైగా తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. ముమ్మట్టి హీరోగా నటించిన ఈ పటనతిల్ భూతమ్ దేవ్ చివరి సినిమా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+