ముఖం చాటేస్తున్న రాములమ్మ

సోమవారంనాడు తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విజయశాంతిని కలిశారు. అయితే ఆమె ఏ విషయమూ చెప్పకుండా, తాను పార్టీలో ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో ఆమె కాంగ్రెసులోకి మారుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల విజయశాంతి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. కాంగ్రెసు పార్టీలో చేరడానికే ఆమె ముఖ్యమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. అయితే, రాములమ్మ వచ్చినప్పుడు పార్టీలోకి ఒక్కరే వచ్చారని, వెళ్లేటప్పుడు ఒక్కరే పోతారని తెరాస వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications