బాబు వద్ద పాఠాలా?: వైయస్

తాము కొమురం భీం పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని గిరిజనులకు సేవలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజనులకు 9 లక్షల ఎకరాలు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చామని, వారికి రుణాలు కూడా కల్పిస్తామని, ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఎస్టీ, ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ విషయంలో గడువు దాటిన విషయం నిజమేనని, అందుకే సాధ్యమైనంత త్వరలో భర్తీ చేస్తామని మంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానానికి తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అడ్డు తగలడానికి పలు మార్లు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications