ఏమీ చేయలేకే రాజీనామా: కృష్ణంరాజు

రెండు నెలల నుంచి తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో ఏం జరుగుతోందో తనకు తెలియదని ఆయన చెప్పారు. పార్టీకి క్లిష్ట పరిస్థితులు కల్పించకూడదనే రెండు నెలలుగా మాట్లాడడం లేదని, నిజానికి తాను రెండు నెలల క్రితమే రాజీనామా చేయాల్సి ఉండిందని, తన వల్ల పార్టీకి ఇబ్బందులు రాకూడదని ఇంత కాలం నిరీక్షించానని ఆయన అన్నారు. తనకు కాంగ్రెసు పార్టీలో మంచి మిత్రులున్నారని, కాంగ్రెసులోనే కాకుండా తెలుగుదేశంలోనూ మిత్రులున్నారని ఆయన చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై తానింకా నిర్ణయం తీసుకోలేదని, తీసుకున్న వెంటనే చెబుతానని ఆయన అన్నారు. దాచుకోవడం తన నైజం కాదని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో తన స్నేహం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పార్టీలో తనను కించపరచడం గానీ, తనను తగ్గించడం గానీ చేయలేదని, తనను గౌరవించారని ఆయన చెప్పారు. పార్టీలో తాను ఏమీ చేయలేకపోతున్నాననే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి కూడా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications