రాములమ్మ వెళ్లదు: హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్: పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తమ పార్టీని వీడి వెళ్లరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. విజయశాంతి తెరాసలోనే ఉంటారని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతోనే ఉంటారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విజయశాంతి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరుతారనే వార్తలను ఆయన ఖండించారు.

పార్టీకి రాజీనామా చేసే విషయంపై విజయశాంతి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. అందువల్ల ఆమె పార్టీలో ఉంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయశాంతి కాంగ్రెసులో చేరుతున్నట్లు ఆ పార్టీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. తమ పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడడానికి ఆయనెవరని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెసు పార్టీలో విజయశాంతి ఎట్టి పరిస్థితిలో కూడా చేరబోరని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+