వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కొడుకు అరెస్టు కుట్ర: బూటా

By Staff
|
Google Oneindia TeluguNews

Buta Singh
న్యూఢిల్లీ: లంచం కేసులో తన కుమారుడు సరబ్జోత్ ను అరెస్టు చేయడం తన వ్యక్తిగత, రాజకీయ జీవితాలపై జరిగిన కుట్రగా జాతీయ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బూటా సింగ్ అభివర్ణించారు. తన రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడానికే తన కుమారుడిని అరెస్టు చేసినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే సిబిఐ పాత్రపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

కాగా, బూటా సింగ్ రాజీనామాకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని బిజెపి నేత గోపీనాథ్ ముండే శుక్రవారం డిమాండ్ చేశారు. బూటా సింగ్ బహిరంగంగా లంచాలు తీసుకున్నారని, ఇది బూటా కుమారుడి అరెస్టు ద్వారా నిరూపితమైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X