సంగారెడ్డి: మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం శిక్షణా విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. వీరిలో ఒకరు పైలట్ కాగా, మరొకర ట్రైనీ పైలట్. దిండిగల్ శిక్షణా విమానాశ్రయం నుంచి ఈ విమానం శుక్రవారం ఉదయం బయలుదేరింది. ఆకాశంలో చక్కర్లు కొట్టిన తర్వాత అది కూలిపోయింది. సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇటువంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా సంభవించాయి.