వైయస్ కు శిక్షణ ఇస్తాం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి తాము శిక్షణ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ఆ విధంగా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తాము శిక్షణ ఇచ్చే రోజు తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. వైయస్ కు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు నూతన శాసనసభ్యులకు పార్టీ శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వైయస్ కు పునశ్చరణ తరగతులు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. గిరిజనులకు తమ ప్రభుత్వం హయాంలో కేటాయించిన నిధులను ఆయన చెప్పారు. గిరిజనుల ఆరోగ్యాన్ని, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సమయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఇద్దరు సీనియర్ నాయకులు, ఇరువురు 1978లోనే రాజకీయాల్లోకి వచ్చారు, ఇద్దరి మధ్య సారూప్యత ఉంది, ఇంతటితో ముగించండి అని ఆయన అన్నారు. దీంతో వాగ్వివాదం సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+