బూటా సింగ్ చుట్టూ ఉచ్చు

నాసిక్ సివిక్ వర్క్స్ కాంట్రాక్టర్ రామారావు పాటిల్ విషయాన్ని పరిష్కరించడానికి తాను చేసుకున్న ఒప్పందాన్ని తన తండ్రికి చెప్పానని సరబ్జోత్ వివరించినట్లు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. బూటా సింగ్ ను ప్రశ్నించడానికి రాజ్యాంగపరంగా తమకు అనుమతి లభించాల్సి ఉందని, అనుమతి లభించగానే బూటా సింగ్ ను ప్రశ్నిస్తామని ఆ వర్గాలు చెబుతున్నాయి. బూటా సింగ్ లాండ్ లైన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు కూడా సిబిఐ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
గత 12 రోజులుగా పలువురు హవాలా ఆపరేటర్లు సరబ్జోత్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పాటిల్ ఫిర్యాదుతో వాటిని ట్రాప్ చేసే పనిలో సిబిఐ అధికారులు పడ్డారు. సరబ్జోత్ ను సిబిఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. సరబ్జోత్ ను ఆగస్టు 15వతేదీ వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications