ఇంకా రాజీనామా ఇవ్వలేదు: గౌడ్

నాలుగు రోజుల్లో తనకు సంబంధించిన ముఖ్యనేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు తెస్తుందని తాను ప్రజారాజ్యంతో చేతులు కలిపినట్లు ఆయన తెలిపారు. తాను ఇంకా ప్రజారాజ్యంలోనే ఉన్నానని చెప్పినప్పటికీ రాజీనామా చేయడం ఖాయమనే విషయం ఆయన మాటల్లో ధ్వనించింది.












Click it and Unblock the Notifications