తెరాస జిల్లా అధ్యక్షుడి రాజీనామా

తాజా రాజకీయ పరిణామాల పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే రాజీనామా చేస్తున్నానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. తాను అధిష్టానం విశ్వాసాన్ని పొందలేకపోయానని ఆయన అన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఆయన శాససనభకు పోటీ చేయాలని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆయనకు అవకాశం రాలేదు. పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కకపోవడంతో మాజీ శాసనసభ్యుడు రామలింగారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications