హైదరాబాద్: హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. దుబాయి నుంచి మంగళవారం నగరానికి వచ్చిన మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో వైద్యులు పరీక్షలు చేశారు. ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఆమెను హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల ఛాతీ వైద్య ఆస్పత్రికి తరలించారు.