టిడిపి, బిజెపి, మజ్లీస్ వాకౌట్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకాల అమలు పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం, బిజెపి, మజ్లీస్ సభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి సభ్యులు సంతృప్తి చెందలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్ స్వగృహ లబ్ధిదారులకు డిసెంబరులోగా ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వకపోవడంపై బిజెపి సభ్యుడు జి.కిషన్ రెడ్డి, మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. రాజీవ్ స్వగృహపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నందున రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన అనంతరం మాట్లాడారు. శాసనసభలో ఏదో విధంగా వేడి రాజేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మోసం చేసిందనే విమర్శను ఆయన ఖండించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షా 28 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వీటిలో 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్లను త్వరలోనే నిర్మిస్తామని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+