మగధీరలో పాట చోరీ: వంగపండు

Magadheera
హైదరాబాద్: మగధీర సినిమాలో తన పాటను వాడుకోవడంపై ప్రముఖ విప్లవకవి వంగపండు ప్రసాద రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాటను నిర్మాతలు చోరీ చేశారని ఆయన ఆరోపించారు. ఏం పిల్లో ఎల్దామొస్తవా అనే పాటను స్ఫూర్తికి విరుద్ధంగా కూడా వాడారని, అసభ్యకర సన్నివేశంలో దాన్ని వాడారని, అది చూసి తనకు బాధ కలిగిందని ఆయన ఒక టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. సినిమాలో ఆ పాట వాడకాన్ని చూసిన ఒక యువకుడు తెలంగాణలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. తాను 1972- 73 ప్రాంతంలో దాన్ని రాసినట్లు ఆయన తెలిపారు. ఎంతో మంది కళాకారులకు, ప్రజలకు స్ఫూర్తినిచ్చిన పాటను ఇలా వాడడం తప్పని ఆయన అన్నారు.

పాటను వాడుకునే విషయంలో తన అనుమతి తీసుకోలేదని, తనకు చెప్పలేదని ఆయన అన్నారు. తన పాట వాడకంపై సినిమాకు సంబంధించిన వారిపై తాను చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. పాటను సినిమా నుంచి ఎత్తేయాలని, తమకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన పాట దుర్వ్యినియోగంపై మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తాను సినిమా నిర్మాతలతో గానీ దర్శకుడితో గానీ మాట్లాడలేదని, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+