మగధీరపై కోర్టుకెక్కిన లాయర్
మచిలీపట్నం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా నటించిన మగధీర చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. మగధీర చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని కోరుతూ ఓ న్యాయవాది కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో న్యాయవాదులను అవమానించారని, న్యాయవాదులను అసభ్యంగా చిత్రీకరించారని, న్యాయవాదుల మనోభావాలను దెబ్బ తీశారని లంకివెట్టి బాలాజీ అనే న్యాయవాది కోర్టుకెక్కారు. చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రముఖ విప్లవ కవి వంగపండు ప్రసాదరావు పాట ఏం పిల్లడో ఎల్దామొస్తవాను వాడుకున్నందుకు, దాని స్ఫూర్తిని దెబ్బ తీసినందుకు ఇప్పటికే దుమారం చెలరేగుతోంది. దీనిపై పిడిఎస్ యు వంటి ప్రజా సంఘాలు ఉద్యమాలకు దిగాయి. కొన్ని చోట్ల సినీ ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.












Click it and Unblock the Notifications