ప్రకాష్ రాజ్ తో శోభారాణి పెళ్లి?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఒక తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. ప్రకాష్ రాజ్, శోభారాణి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా ఆ టీవీ చానల్ చూపించింది. ప్రకాష్ రాజ్ తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో పలు సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
ప్రకాష్ రాజ్ తన భార్య డిస్కో శాంతితో ఆ మధ్య కాలంలో విడాకులు తీసుకున్నారు. వీరిద్దిరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 16 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. శోభారాణిని ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నట్లు గతంలో కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పెళ్లి దుస్తుల్లోని ఫొటోలు విడుదలయ్యాయి. కె. బాలచందర్ ద్వారా సినీ రంగంలో ప్రకాష్ రాజ్ కు బ్రేక్ వచ్చింది.












Click it and Unblock the Notifications