స్పీకర్ చెప్తే వివరిస్తా : టీవీ
హైదరాబాద్: స్పీకర్ అనుమతిస్తే తన బాధనంతా శాసనసభలో వివరిస్తానని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో అరెస్టయిన టీవీ రామారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గురువారం శాసనసభకు హాజరయ్యారు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను న్యాయపోరాటం సాగిస్తానని ఆయన అన్నారు.
జీవితంలో తాను ఇంత నరకం ఎప్పుడూ అనుభవించలేదని ఆయన అన్నారు. తనను కేసులో ఇరికించారని, కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని ఆయన అన్నారు. ఇంత కన్నా మరో శిక్ష ఎవరికీ ఉండదని ఆయన అన్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications