తాలిబాన్ నేత మెహసూద్ మృతి?

మెహసూద్ మరణించినట్లు దాఖలాలు లేవని అమెరికా రక్షణ శాఖ అధికారి అంటున్నారు. అయితే మెహసూద్ రెండో భార్య మరణించినట్లు మాత్రం అమెరికా, పాకిస్తాన్ అధికార వర్గాలంటున్నాయి. దక్షిణ వజీరిస్తాన్ లోని మకీన్ లో గల మెహసూద్ మామ ఇంటిపై జరిగిన దాడిలో ఆమె మరణించినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో మెహసూద్ ఇంట్లో లేడని చెబుతున్నారు.
మెహసూద్ భార్యతో పాటు అతని సోదరుడు, అతని ఏడుగురు అంగరక్షకులు మరణించినట్లు పాకిస్తాన్ సీనియర్ భద్రతాధికారులు చెబుతున్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. ఆ మృతదేహం మెహసూద్ ది కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications