టిడిపి బాబు సొత్తు కాదు: ప్రసన్న

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడి సొత్తు కాదని ఆ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్టీ రాజీనామా చేయాలని తెలుగుదేశం నాయకులు చేసిన డిమాండ్ ను ఆయన తిరస్కరించారు. మరో శాసనసభ్యుడు బాలనాగిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని శుక్రవారం కలిసిన అనంతరం ఆయన శాసనసభలో మీడియా సెల్లో విలేకరులతో మాట్లాడారు. తనను రాజీనామా చేయాలని అడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. తాను నోరు విప్పితే చంద్రబాబు బండారం బయటపడుతుందని ఆయన అన్నారు. తాము ఎటువంటి ప్రలోభాలకూ గురి కాలేదని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ గాడి తప్పుతోందని, తాము వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.ప్రలోభ పెట్టడం, మోసం చేయడం చంద్రబాబు నైజమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును తప్పు పడుతూ ఆయన గురువారం లేఖాస్త్రం సంధించిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. వారి విమర్శలను ప్రసన్నకుమార్ రెడ్డి తిప్పి కొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+