రాజీనామాపై ఆలోచిస్తా: నన్నపనేని

కారంచేడులో తనపై దాడి చేయించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక శాసనసభ్యుడిగా మాత్రమే చూడాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కారంచేడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనపై దాడి చేయించారని ఆమె ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత ఆస్తి తగాదా కాదని, పార్టీ వ్యవహారమని, ఈ విషయంలో మండలిలో విపక్ష నేత దాడి వీరభద్రరావు తనకు సహకరించలేదని, వాకౌట్ చేస్తే ఎవరూ రాలేదని ఆమె అన్నారు. కారంచేడు వెళ్లి తప్పు చేశానన్న బాధ కలుగుతోందని ఆమె అన్నారు. తిట్లు, తన్నులు ఎందుకు తిన్నానా అని అనిపిస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications