దేవేందర్ గౌడ్ బాటలో తమ్మినేని?

నిజానికి దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డిలతో పాటే వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉండింది. అయితే ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. దానివల్లనే వారి చేరికలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాజీలను చేర్చుకోవాల్సిన అవసరం గురించి చెప్పి ఎర్రంనాయుడు చంద్రబాబును ఒప్పించడానికి సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పాత కాపులను చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, అదే సమయంలో ఎన్నికల్లో తీవ్రంగా నష్ట పరిచిన ప్రజారాజ్యం పార్టీని బలహీన పరచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications