అల్లు ఇంటి వద్ద వంగపండు ధర్నా

తమ మూడు డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమం సాగిస్తామని ఆయన చెప్పారు. చర్చల కోసం తన వద్దకు అల్లు అరవింద్ మధ్యవర్తిని పంపారని, అయితే అప్పటికే సినీ నిర్మాత వైఖరిపై ఉద్యమం చేయడానికి ఒక కమిటీ ఏర్పడిందని, కమిటీ మూడు డిమాండ్లను సూత్రీకరించిందని, ఆ డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమం సాగుతుందని ఆయన వివరించారు. నిర్మాత పాటను తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ధర్నా సందర్భంగా అల్లు అరవింద్ కు చెందిన వ్యక్తులు ధర్నా చేస్తున్న కళాకారులతో వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. చేతులు వేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.












Click it and Unblock the Notifications