వైయస్ కనుసన్నల్లో స్పీకర్: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కనుసన్నల్లో శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ సభ్యులు సస్పెండ్ అయిన అనంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్పీకర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదని స్పీకర్ అంటున్నారని, అయితే తమ హక్కుల కాలరాసినప్పుడు తాము ప్రశ్నించక తప్పదని ఆయన అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని తాము బిఎసిలో అంగీకరించలేదని, తాము వ్యతిరేకించామని, బిఎసిలో తాము అంగీకరించినట్లు స్పీకర్ చెప్పడంలో నిజం లేదని ఆయన అన్నారు.

శాసనసభలో తాము ఎక్కడా మాట్లాడకుండా చేస్తున్నారని, తమ కార్యాలయంలో కూడా మాట్లాడకుండా చూస్తున్నారని, మునుపెన్నడూ లేని విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. స్పీకర్ ఇష్టారాజ్యంగా ప్రత్యక్ష ప్రసారాలను కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అన్నింటినీ చూపిస్తే శాసనసభలో స్పీకర్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన అన్నారు.ప్రభుత్వం తమను చూసి భయపడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుపై తాము శాసనసభలోపలా, వెలుపలా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+