నల్లగొండ: రాష్ట్రంలో సంభవిస్తున్న రైతుల ఆత్మహత్యలకు నల్లగొండ జిల్లా భువనగిరి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. తాగుడుకు బానిసలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కరవు పరిస్థితుల్లో రైతులు తాగుడుకు బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. రైతులు జీవించడానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.