Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపి ఎమ్మెల్యేలు సూప్ తాగారు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యులు గంజి పేరుతో సూప్ తాగారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని తెలియజేయడానికి తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభ ఎదుట గన్ పార్కులో గంజి కాసి తాగడాన్ని ప్రస్తావిస్తూ ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరికి కూడా గంజి తాగే గతి పట్టలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూను నిరోధించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు.కరువు పరిస్థితిపై తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరపు ప్రకటన ఆలస్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రైతులకు రుణాలు, పంటల బీమా వర్తించేలా చూస్తామని ఆయన చెప్పారు.

అంతకు ముందు ఆయన రాష్ట్రంలో కరువు పరిస్థితిపై శాసనసభలో ప్రకటన చేశారు. జిల్లాకో ప్రత్యేక సహాయాధికారిని నియమించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం తాత్కాలికమేనని, ఆగస్టు మధ్యకల్లా వర్షాలు పడతాయని తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. నెలాఖరు వరకు నిరీక్షించి కరవు ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. అధికారికంగా ప్రకటన చేయకపోయినా అధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు.

నైరుతి సీజనల్ 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఆయన అన్నారు. 11 జిల్లాల్లో లోటు వర్షపాతం, 10 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం, రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అదనపు విద్యుత్, ఉపాధి హామీ నిధుల కోసం కేంద్ర సాయాన్ని అర్థించినట్లు ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+