వైయస్ అనాల్సింది కాదు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావును ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అలా అనాల్సింది కాదని ప్రజారాజ్యం పక్ష నేత చిరంజీవి అన్నారు. సస్పెండ్ అయిన ఎర్రబెల్లి దయాకరరావు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత చిరంజీవి తన అభిప్రాయం చెప్పారు. స్పీకర్ తర్వాత తాము గౌరవించేది సభా నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డినే అని, అటువంటి నేత అలా మాట్లాడడం సరి కాదని, ముఖ్యమంత్రి అలా అనకుండా ఉంటే బాగుండేదని అనిపించిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అలా మాట్లాడాల్సింది కాదని అనిపించిందని ఆయన అన్నారు.

రన్నింగ్ కామెంటరీ అనేది కొత్త కాదని, దాని మీద ఇప్పటి వరకు నియంత్రణ లేదని, అలా నియంత్రణ కొనసాగుతున్నప్పుడు దయాకర రావు మీద చర్య తీసుకుని ఉంటే ఫరవా లేదని, అలా లేనప్పుడు దయాకరరావును సస్పెండ్ చేయడం ఏకపక్షమేనని ఆయన అన్నారు. సభలో ప్రజాసమస్యలు పరిష్కారం కోసం కాకుండా గందరగోళం జరుగుతోందని, ఈ రోజు సంఘటనలు గత పర్యవసానాలేనని ఆయన అన్నారు. దయాకరరావుపై సస్పెన్షన్ ఎత్తేయాలని ఆయన స్పీకర్ కోరారు.

ముఖ్యమంత్రి వైయస్ దయాకరరావును అలా అనడం సరి కాదని సిపిఐ పక్ష సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. దయాకరరావు సస్పెన్షన్ ను ఎత్తేయాలని ఆయన కోరారు. దయాకర రావును ఉరేశారని బిజెపి సభ్యుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రులు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. దయాకరరావు సస్పెన్షన్ ను ఎత్తేయాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+