చిరు పార్టీపై నమ్మకం లేదు: సీతారాం

జీవిత కాలమంతా మీరే ఏలుకోండి అని చిరంజీవి శాసనసభలో కాంగ్రెసు నాయకులతో అనడం ప్రజారాజ్యం పార్టీ ఏమిటో తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకే అధికారం ఇచ్చినప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. బలోపేతం చేయడానికి అవకాశాలున్నాయని, అయితే ప్రజారాజ్యం పార్టీ బలోపేతానికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications