స్పీకర్ కు ఎర్రబెల్లి రాజీనామా లేఖ

శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆయన అన్నారు. తనను రౌడీగా భావిస్తే రాజీనామాను ఆమోదించాలని ఆయన స్పీకర్ ను కోరారు. తన రాజీనామా ఆమోదించకపోతే తన ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆయన కోరారు. తాను నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాయనని, తాను ఎప్పుడూ రౌడీయిజం చేయలేదని ఆయన అన్నారు. తన రౌడీయిజంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తన ప్రతిష్టను కాపాడేంత వరకు రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.












Click it and Unblock the Notifications