ఎర్రబెల్లి రాజీనామా డ్రామా: సురేఖ

చేతనైతే శాసనసభ సభ్యత్వానికి నిజంగా రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని ఆమె దయాకరరావుకు సవాల్ విసిరారు. తన మరిది ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కందులు దొరికాయని ఒక పత్రికలో వచ్చిన వార్తను ఆమె ఖండించారు. ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనను రౌడీలా వ్యవహరిస్తున్నావని అన్నందుకు మనస్తాపానికి గురైన ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, దయాకర రావుల మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది.












Click it and Unblock the Notifications