కడప: కడప జిల్లా ఓబులవారిపల్లె పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ఒకతను గురువారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. హరిబాబు అనే విద్యార్థి గొంత కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హరిబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతిలో రుయా ఆస్పత్రికి తరలించారు. అతను నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందినవాడు.