ఎమ్యెల్యే రమేష్ కు షోకాజ్ నోటీసు

Chandrababu Naidu
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వేములవాడ తెలుగుదేశం శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబుకు కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన పౌరసత్వంపై ఈ షో కాజ్ నోటీసు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ తో రమేష్ బాబు భారత పౌరసత్వం పొందారని ఆరోపిస్తూ కాంగ్రెసు నాయకుడు ఆదిశ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

రమేష్ బాబు సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వర రావు కుమారుడు. నిజానికి, 1999 ఎన్నికల్లోనే ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలని భావించాడు. అయితే పౌరసత్వం సమస్య తలెత్తడంతో పోటీ చేయలేకపోయారు. ఈసారి కొత్తగా ఏర్పడిన వేములవాడ శాసనసభా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+