తస్లీమా వీసా గడవు పొడగింపు

ఆమె భారత వీసా గడువు ఈ నెల 17వ తేదీతో ముగుస్తుంది. దీంతో దాని గడువును పొడగించాలని ఆమె కోరారు. దాంతో ఆమె వీసా గడువును 2010 ఫిబ్రవరి 16వ తేదీ వరకు పొడగించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఆమె రాసిన లజ్జ నవల వివాదాస్పదంగా మారింది. ఆమె భవిష్యత్తు కార్యక్రమమేమిటో తెలియడం లేదు. భారత దేశంలో ఆమె ఎక్కువ కాలం ఉండదలుచు కోలేదు. దీంతో ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. ఆమెకు ఇస్లాం మత ఛాందసవాదుల నుంచి ముప్పు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications