ఖమ్మం: ఖమ్మంలో ప్రేమ పేరుతో సమీనా అనే యువతిని మోసగించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కఠారి రవిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రవి తనను ప్రేమించి, మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడని బాధితురాలు జిల్లా ఎస్పీకి ఇంతకు ముందు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని సమీనా ఖమ్మంలోని రవి ఇంటి ముందు మౌనపోరాటం మొదలు పెట్టింది. దీంతో అతనిపై ఖమ్మం మూడో పట్టణం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.