మావోల నేత రామకృష్ణ అరెస్టు?

మల్కాన్ గిరి జిల్లా పొదిలిలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ముగ్గుర మహిళా నక్సలైట్లు హతమయ్యారు. పొదిలిలో జరిగే మావోయిస్టు పార్టీ ప్లీనరీ సమావేశానికి అగ్రనేతలు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలను విజయనగరం జిల్లా ఎస్పీ వై. గంగాధర్ ఖండిస్తున్నారు. తమ అదుపులో మావోయిస్టు అగ్రనేతలు లేరని ఆయన చెబుతున్నారు. కాగా, అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేతలను కోర్టు హాజరు పరచాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications