అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా లోలూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.