క్షమాపణలు అక్కర్లేదు: షారూఖ్

షారూఖ్ ఖాన్ పేరు కంప్యూటర్లో కనిపించిన మరు క్షణమే అమెరికాలోని విమానాశ్రయం భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకుని నిర్బంధించారు. భారత దౌత్య కార్యాలయం జోక్యం వదిలేశారు. తాను ఇంతకు ముందు షూటింగ్ కోసం అమెరికా వచ్చానని, ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చానని చెప్పినా వారు వినలేదు.
పద్ధతిని పాటించడాన్ని తాను తప్పు పట్టడం లేదని, తనకు వీసా జారీ చేసినప్పుడు తన చేతివేళ్ల ముద్రలు, తన ఫొటో ఇచ్చానని, వాటి ద్వారా తన వివరాలను కనుక్కోవచ్చు కదా అని ఆయన అన్నారు. తన వ్యక్తిగత బాడీగార్డు లేకపోవడం తనకు ఇబ్బంది కలిగించిందని, అతనికి వీసా లభించలేదని, అయితే టూరిస్టు వీసా కింద తీసుకుని వెళ్లగలిగి ఉండేవాడినని, అయితే నిబంధనలను కాదనలేకపోయానని ఆయన ఒక ఆంగ్ల దినపత్రికతో వివరించారు.












Click it and Unblock the Notifications