వీధి పోరు లాభం లేదు: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డగించడానికి తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన సోమవారం శాసనసభలో ఆ విషయం చెప్పారు. మన రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉందని, తాము ఉదాసీనంగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. సమస్యలకు వీధి పోరాటాలు పరిష్కారం కాదని ఆయన అన్నారు.

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు.కర్నాటకలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఉన్న పవర్ ప్రాజెక్టులకు ఆటంకం కలుగుతుందనే భయంతోనే అక్రమ ప్రాజెక్టులను ప్రభుత్వం నిలువరించలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాబ్లీ ప్రాజెక్టుపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు అనిల్ తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+